ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆదిలాబాద్
తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ కి చెందిన దుర్గబాయి బిడ్డ రిమ్స్ లో మృతి చెందగా, ఇంద్రవెల్లి మండలం దుబ్బగూడకు చెందిన నాగుబాయి బిడ్డను నిర్మలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత్యువాత పడ్డారు. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.