జనసేన పార్టీలోకి వలసల వరద

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని ఆర్జీ కొత్తూరు గ్రామంలో వైయస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 250 మంది సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. చింతపల్లి మండల అధ్యక్షుడు వంతల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వంతల సుబ్బారావు పాల్గొని కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.