హార్ముజ్ జలసంధిలో ఘోరం: నాలుగు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం చేసిన ఇరాన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్ల పేలుళ్ల కారణంగా నాలుగు ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో రెండు నౌకలను అడ్డగించి నిలిపివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్ను తమ దేశ వాయు రక్షణ దళాలు కూల్చివేశాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని రక్షణ నిపుణులు పేర్కొన్నారు.