హైకోర్టు అనర్హత తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టున్న దానం నాగేందర్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన ఆయనపై హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేయడంతో, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లయిందని మరియు త్వరలోనే ఉప ఎన్నిక రావడం అనివార్యమైందని స్పష్టమవుతోంది.