వరంగల్ ఎయిర్‌పోర్టుకు సోనియా పేరు పెడితే బరాబర్ తిరగబడతాం
రిపోర్టర్: నరేష్
స్థలం: Warangal
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కాకతీయులు లేదా సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎయిర్‌పోర్టుకు సోనియా గాంధీ పేరు పెడితే రాష్ట్రంలో తీవ్రంగా తిరగబడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికే సోనియా పేరు వైపు మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఓరుగల్లు చరిత్ర కలిగిన స్థానిక ఐకాన్ల పేర్లను కాదని గాంధీ కుటుంబం పేరు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.