పోక్సో కేసులో సంచలన తీర్పు: నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
మధిర పట్టణ పరిధిలో బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరం రుజువు కావడంతో నిందితుడు గడ్డాల అరవింద్ కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్ తీర్పు వెల్లడించినట్లు అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వైరా ఏసీపీ ఎం.ఏ.రహమాన్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శరత్ కుమార్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.