వరంగల్ జిల్లాలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: వరంగల్

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నర్రెంగతండాలో కుటుంబ కలహాలతో బానోతు జవహర్‌లాల్‌(45) ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదం మరియు కుటుంబసభ్యులతో జరిగిన గొడవ కారణంగా క్షణికావేశంలో అతను ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గతంలోనూ పలుమార్లు బెదిరించడంతో కుటుంబసభ్యులు ఆయనను హెచ్చరించగా, చివరికి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడి తండ్రి భీమ్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.