కాంగోలో ఘోర విమాన ప్రమాదం ఇద్దరు సైనికాధికారులతో సహా 14 మంది దుర్మరణం

రిపోర్టర్: సురేష్ స్థలం: కాంగో

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనికాధికారులతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే వెల్లడించారు. క్వాంగో ప్రావిన్స్లోని కెంజ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సైన్యం ప్రకటించింది.