అంగన్వాడీ కేంద్రానికి కుక్కర్ బహుకరించి చాటుకున్న సేవాభావం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం దూది వెంకటాపురం అంగన్వాడి కేంద్రం 1కి బి. శంకరమ్మ కుక్కర్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆయా తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రం అవసరాలను గుర్తించి ముందుకు వచ్చిన దాతను పలువురు అభినందించారు. చిన్న సాయమైనా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, చిన్నారుల సంక్షేమం కోసం అందరూ సహకరించాలని ఈ సందర్భంగా స్థానికులు అభిప్రాయపడ్డారు.