మెరకముడిదాం మండలంలో మాంగనీస్ అక్రమ తవ్వకాలు కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం కొత్తకర్ర సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా మాంగనీస్ ఖనిజం అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్లతో రవాణా చేస్తున్న ఖనిజాన్ని గనుల శాఖ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైకాపా నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గనుల శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.