వైద్యరంగంలో కొత్త కలకలం: డబుల్ డయాబెటిస్పై డాక్టర్ దిలీప్ హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

మధుమేహంలో కొత్తగా డబుల్ డయాబెటిస్ సమస్య పెరుగుతోందని సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ గూడె వెల్లడించారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోడవడంతో ఈ ముప్పు వస్తుందని ఆయన తెలిపారు. జీవనశైలి మార్పులతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా దీనికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతున్నాయని, బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచించారు.