గుండెపోటుపై వైద్య నిపుణుల హెచ్చరిక: ఫిట్నెస్ ఒక్కటే గుండెకు రక్షణ కాదు
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
ఫిట్నెస్గా ఉన్నంత మాత్రాన గుండెపోటు రాదనుకోవడం పొరపాటని, ఇది కేవలం రక్షణనిస్తుందని కానీ సంపూర్ణ హామీ ఇవ్వలేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే యువత సైతం గుండెపోటు బారిన పడుతున్నారని, వంశపారంపర్య కారణాలు, జన్యుపరమైన లోపాలు, రక్తనాళాల్లో కొవ్వు చేరడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణమని వైద్యులు తేల్చిచెప్పారు.