ఈ నెలాఖరులో ప్రభుత్వానికి పీఆర్సీ కమిటీ నివేదిక

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

ఈ నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు శివశంకర్ నేతృత్వంలోని పీఆర్సీ కమిటీ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న కమిటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, త్వరలోనే చీఫ్ సెక్రెటరీకి రిపోర్ట్ అందించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫిట్‌మెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.