గ్రామ పంచాయతీల పునరుద్ధరణ: హైకోర్టు ఆదేశాలతో కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Amaravati
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో విలీనం చేసిన పలు గ్రామాలను తిరిగి స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రీ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల అనుగుణంగా కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాలను మున్సిపాలిటీల నుంచి మినహాయించి, పూర్వపు పంచాయతీ వ్యవస్థలనే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.