రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: సికింద్రాబాద్

దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు ఈ పరీక్షలు జరగనుండగా, సికింద్రాబాద్ రీజియన్‌లో 1420 ఖాళీలు ఉన్నాయి. పరీక్ష తేదీకి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.