యాదగిరిగుట్ట హుండీలో కాసుల వర్షం కురిపించిన భక్తులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం ఆలయ అధికారులు లెక్కించారు. గత 44 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,60,59,278 నగదుతో పాటు 65 గ్రాముల బంగారం, 2 కిలోల 650 గ్రాముల వెండి స్వామి వారి ఖజానాకు చేరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది, అధికారులు పారదర్శకంగా పాల్గొన్నారు.