జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్ విజేతగా భారత్

రిపోర్టర్: అశోక్ స్థలం: చైనా

చైనా వేదికగా జరిగిన మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ ఫైనల్స్ లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తరఫున సానికా చంద్రకాంత్ 17వ నిమిషంలో ఏకైక గోల్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. వరుసగా మూడోసారి ఆసియా టైటిల్ కైవసం చేసుకున్న భారత జట్టు, ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కు అర్హత సాధించింది.