వినాయక చవితి వేళ కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

నిర్మల్ జిల్లా కడెం మండలంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఓ వైపు గణనాథుడి సందడి నెలకొనగా మరోవైపు కురుస్తున్న వర్షాలతో ప్రజలు పూజా సామగ్రి సేకరణలో కొంత ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వెళ్లి పూజా సామగ్రి సేకరించేందుకు ఇబ్బంది ఎదురైనప్పటికీ వినాయక చవితి వేళ వరుణుడు కరుణించడంతో రైతుల్లో మాత్రం తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.