ఈస్గాం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఈ. వెంకటేష్ బాధ్యతల స్వీకరణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కాగజ్ నగర్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా ఈ. వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొని నూతన ఎస్సైకి ఘనంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.