ఏపీలో త్వరలోనే సీప్లేన్ల సర్వీసులు, వాటర్‌డ్రోమ్‌ల నిర్మాణానికి టెండర్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీప్లేన్ల సర్వీసులు ప్రారంభించనుంది. పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌ల నిర్మాణానికి ఏపీటీడీసీ త్వరలో టెండర్లు పిలవనుంది. స్కైహోప్‌, మె హెయిర్‌ సంస్థలు సీప్లేన్లు నడిపేందుకు ముందుకొచ్చాయి. తొలి దశలో విజయవాడ, శ్రీశైలం, విశాఖ, లంబసింగి సహా పలు ప్రధాన ప్రాంతాల్లో దశలవారీగా ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.