రాష్ట్ర అభివృద్ధిపై క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో కీలక చర్చ

రిపోర్టర్: మహేష్ స్థలం: అనకాపల్లి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రి అనిత వంగలపూడి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై సహచర మంత్రులతో కలిసి విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో సుదీర్ఘంగా సమాలోచనలు నిర్వహించారు.