బందరు పట్టణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్న మంత్రి కొల్లు రవీంద్ర
రిపోర్టర్: రాజేష్
స్థలం: కృష్ణా
ఎన్ని దుష్ట శక్తులు అడ్డంకులు సృష్టించినా మచిలీపట్నం పట్టణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నాన్ని అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా రాబోయే కాలంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.