సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు నూతన గడువు విధించిన సీజేపీ
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడువులోగా తప్పుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి, జంతర్ మంతర్ 2.0 తరహా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఎన్నికల జాబితా ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. మరోవైపు సీఈసీపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.