హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ను ఢీకొన్న కారులో ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: రాము
స్థలం: కలువాయి
కలువాయి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. వెంకటరామరాజుపేట జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా ఢీకొనడంతో మణికల సుధాకర్, షేక్ రసూల్బాషా మృతి చెందారని పేర్కొన్నారు. పని ముగించుకొని సొంత గ్రామాలకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుందని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.