ఏపీలో రేషన్ కార్డుదారులకు సబ్సిడీ ధరలకే నిత్యావసరాలు అందించనున్న సర్కార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుదారులకు దీపావళి కానుకగా ప్రభుత్వం సబ్సిడీపై నిత్యావసరాలు అందించనుంది. రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పును వంద రూపాయలకు, గోధుమ పిండిని ఇరవై ఐదు రూపాయలకు, లీటర్ పామాయిల్ ను నూట ఇరవై ఐదు రూపాయలకు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే మొబైల్ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించారు.