విశాఖలో నార్కోటిక్ డాగ్ సహాయంతో గంజాయి పట్టివేత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం పెందుర్తి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ విశ్వ సహాయంతో నాలుగు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం పెందుర్తి పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన డాగ్ విశ్వ, డాగ్ హ్యాండ్లర్ మరియు పోలీసు సిబ్బందిని నగర సీపీ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.