స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై సందిగ్ధత వీడింది: రెండు రోజుల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితా

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేయడంపై టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల మధ్య చర్చలు సఫలమయ్యాయని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరిందని, త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.