బిచ్చగాడి అవతారమెత్తిన మహారాష్ట్ర అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాగ్ షా

రిపోర్టర్: వెంకట్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే, ఘట్‌కోపర్ ఈస్ట్ బీజేపీ శాసనసభ్యుడు పరాగ్ షా జైన గురువు సూచన మేరకు బిచ్చగాడి అవతారమెత్తి ముంబై వీధుల్లో ఒక్కరోజు గడిపారు. రూ. 3,383 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, తన హోదాను పక్కనపెట్టి సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణిస్తూ, రోడ్లపై భిక్షాటన చేస్తూ పేదల కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా జీవిత వాస్తవాలను, పేద ప్రజల కష్టాలను తెలుసుకున్నానని ఆయన తెలిపారు.