పాన్ ఇండియా సంచలనం: ప్రభాస్ స్పిరిట్ మూవీ విడుదల తేదీ ఖరారు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ 'స్పిరిట్' సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను వచ్చే ఏడాది 2027 దీపావళి కానుకగా అక్టోబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.