కంటి చూపును ప్రసాదించే ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని కడ్తల్ లోని ఎంబీఏ గార్డెన్స్ లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఆరో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. కంటి సమస్యలతో బాధపడుతున్న స్థానిక మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిబిరంలో నిపుణులైన వైద్యుల చేత ఉచిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయనున్నారు.