బీజేపీ ఓట్లు తొలగింపు కుట్రను కమ్యూనిస్టులు తిప్పికొట్టాలి: రేవంత్ రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ ఓట్లు తొలగింపు కుట్రకు పాల్పడుతోందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కోటి ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలతో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని, పేదల ఓటు హక్కును కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.