బొబ్బిలిలో సంతోష్‌ మృతి కేసులో వీడుతున్న మిస్టరీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి వంతెన సమీపంలో సంతోష్‌ మృతి కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. వినాయక చందా వసూలుకు వెళ్లిన సంతోష్‌ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. రహదారి ప్రమాదం కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ యువకుడు వాట్సప్‌ గ్రూపులో పంపిన వీడియో సందేశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.