మున్సిపల్ ఎన్నికల ప్రశాంతతపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: వినుకొండ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరిగాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా కాపాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గత పాలనలో స్థానిక ఎన్నికల్ లో అనేక దౌర్జన్యాలు జరిగాయని మండిపడ్డారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో రౌడీలతో కుట్రలు పన్నారని, ఓటమి భయంతోనే రాద్ధాంతం చేశారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.