ఎల్‌పీజీ సిలిండర్‌ బుకింగ్‌పై కేంద్రం కీలక మార్పులు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ వ్యవధిలో కేంద్రం కీలక మార్పులు చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరికీ ఒకేవిధంగా 25 రోజుల వ్యవధిని నిర్ణయించింది. గతంలో నగరాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగా ఉన్న నిబంధనను సడలించారు. బ్యాక్‌లాగ్‌లు తగ్గడంతో ఈ కొత్త నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.