జగిత్యాల జిల్లాలో దసరా వేడుకలు: పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టిన ఎస్పీ
రిపోర్టర్: రమేష్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ వేడుకల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ జగిత్యాల (SP Jagtial) వెల్లడించారు. మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో వేడుకలు నిర్వహించే ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు నిర్వహణ తీరును సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అక్కడి అధికారులకు పలు కీలక సూచనలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.