తీవ్ర అలర్ట్: బహుదా నది వరద ఉప్పొంగడంతో జాతీయ రహదారిపైకి నీరు

రిపోర్టర్: విజయ్ స్థలం: Srikakulam

తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బహుదా నది వరద నీరు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిధిలోని జాతీయ రహదారిపైకి చేరిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. గురువారం వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారని, ప్రజల భద్రత కోసం తగిన ముందస్తు చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు.