'సింహపురిలో పసుపు సైన్యం గర్జన': వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
సింహపురిలో పసుపు సైన్యం గర్జన అదిరిపోయిందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారని, ఈ ఆప్యాయతను జీవితాంతం గుండెల్లో దాచుకుంటానని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె తన సంతోషాన్ని పంచుకుంటూ, పార్టీ కేడర్ చూపిన అంకితభావంపై హర్షం వ్యక్తం చేశారు.