'పాత ఓటర్లు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే': ఎమ్మెల్సీ ఓటర్ల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గురువారం నూతన ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 2027తో పదవీకాలం ముగియనున్న ఈ స్థానాలకు సంబంధించి, గత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఫారమ్-18 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని అధికారులు తెలిపారు.