తిరుమలలో అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: శివ స్థలం: తిరుమల

తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అక్టోబర్ 11న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అక్టోబర్ 16న గరుడసేవ వైభవంగా జరుగుతుందని వివరించారు. అక్టోబర్ 20న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని, భక్తులు ఈ వేడుకలను తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.