యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన లిండా నోస్కోవా

రిపోర్టర్: విజయ్ స్థలం: World

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లిండా నోస్కోవా అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. మార్తా కోస్ట్యూక్‌పై విజయం సాధించి తొలిసారి ఈ టోర్నీలో చివరి ఎనిమిది మంది జాబితాలో స్థానం సంపాదించారు. సెమీస్ బెర్త్ కోసం ఆమె ప్రపంచ నంబర్ వన్ అర్యనా సబలెంకతో తలపడనున్నారు.