బ్రిజ్ భూషణ్ నిర్దోషిగా విడుదల తీర్పును సవాల్ చేసిన మహిళా రెజ్లర్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు క్లీన్ చిట్ ఇస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆగస్టు మూడున వచ్చిన ఈ తీర్పు చట్టవిరుద్ధమని, సాక్ష్యాలను సరిగ్గా పరిశీలించకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందని అప్పీల్లో పేర్కొన్నారు. బాధితుల ప్రవర్తనపై పాతకాలపు ఆలోచనలతోనే తీర్పు వెలువడిందని, నిందితుడు వినోద్ తోమర్ నిర్దోషిత్వాన్ని కూడా ప్రశ్నించినట్లు వారు తెలిపారు.