వైద్య భవనం పూర్తి కాలేదు: కూటమి సర్కార్‌పై ఉమా శంకర గణేష్ నిప్పులు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. గొలుగొండ మండలంలో చీడిగుమ్మల పీహెచ్సీ నిర్మాణానికి రూ. 2.55 కోట్లు మంజూరైనా గత మూడు సంవత్సరాలుగా పనులు పూర్తికాలేదని ఆయన తెలిపారు. పాత పంచాయతీ ఆఫీసులోనే ఆసుపత్రిని నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.