భక్తిపై ఉక్కుపాదం మోపిన యాజమాన్యానికి ఎదురైన నిరసన జ్వాలలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ జూనియర్ కాలేజీలో భక్తిశ్రద్ధలతో గణేష్ మాల ధరించిన విద్యార్థులను తరగతి గదులకు అనుమతించకుండా కాలేజీ బయటకు పంపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మాలాధారణతో రావద్దంటూ ప్రిన్సిపల్ తమను బయటకు పంపించారని విద్యార్థులు ఆరోపించారు. యాజమాన్యం కర్కశ వైఖరిని నిరసిస్తూ కళాశాల గేటు ముందు విద్యార్థులు పెద్దఎత్తున ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ మత విశ్వాసాలను గౌరవించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిరసనతో కాలేజీ వద్ద ఉద్విగ్న వాతావరణం అలుముకుంది.