ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్లతో శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: ఆత్మకూరు
ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్థానికంగా రూ.29 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల విలువైన పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.