టామ్ బ్రాడీపై లోగన్ పాల్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: నరేష్ స్థలం: World

ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీపై ప్రముఖ అథ్లెట్ లోగన్ పాల్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పీబీడీ పాడ్‌కాస్ట్ వేదికగా మాట్లాడిన లోగన్ పాల్, బ్రాడీ ఎంతటి దిగ్గజమైనా ప్రవర్తనలో మాత్రం కొంచెం కూడా వినయం లేదని, ఆయనో సోర్ లూజర్ అని మండిపడ్డారు. గతేడాది కాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.