వంట చేయడం అంటే తనకు చాలా ఇష్టమంటూ నటి శ్రీలీల వెల్లడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తనకు సాంబారు, కొబ్బరన్నం, కుర్మాకూర వంటి అనేక వంటలు చేయడం వచ్చని సినీ నటి శ్రీలీల పేర్కొన్నారు. ఇటీవలే నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పాకశాస్త్ర నైపుణ్యాలతో పాటు ఇష్టమైన ఆహారపు అలవాట్లను పంచుకున్నారు. ఎలాంటి వెరైటీ వంటకాలు వండినా తన మెనూలో మాత్రం పెరుగన్నం తప్పనిసరిగా ఉండాలని ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు పెరుగన్నం అంటే ఎంతో ఇష్టమని, తాను వంటలను ఎంతో ఆస్వాదిస్తానని ఈ సందర్భంగా శ్రీలీల వెల్లడించారు.