బుడమేరు ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
విజయవాడ బుడమేరు వాగు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిరంతరం నిఘా ఉంచి అనధికార నిర్మాణాలను అడ్డుకోవాలని స్పష్టంచేసింది. ఆక్రమణలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వొద్దని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు తెలిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రజాహిత వ్యాజ్యాల విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.