బెంగళూరులోని వత్తూరు గుంజుర్ రోడ్డులో ప్రారంభమైన మరమ్మతులు

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

బెంగళూరులోని వత్తూరు గుంజుర్ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ మరియు అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిపై వస్తున్న నివేదికల నేపథ్యంలో అధికారులు స్పందించారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలోని బెంగళూరు తూర్పు నగర కార్పొరేషన్ కమిషనర్ డి.ఎస్. రమేష్ ఆదేశాల మేరకు గుంతల పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు, కల్వర్టు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.