ఆటోమొబైల్ రంగంలో సంచలనం: కొత్త వర్టస్ ఫేస్లిఫ్ట్ టీజర్ విడుదల చేసిన వోక్స్వ్యాగన్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ ఇండియా తన పాపులర్ సెడాన్ వర్టస్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ మొదటి అధికారిక టీజర్ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ అప్ కమింగ్ కారు ఎక్స్టీరియర్ డిజైన్ పై స్పష్టత రాగా, సరికొత్త లైటింగ్ సెటప్ తో పాటు స్పోర్టీ జీటీ డిజైన్ ఎలిమెంట్స్ పొందుపరిచారు. నవంబర్ మధ్యలో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉండటంతో ఆటోమొబైల్ ప్రియులలో ఈ అప్డేట్ తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది.