పంజాబ్ లో పూర్తిగా విఫలమైన ఆప్ ప్రభుత్వం: సీఎం భగవంత్ మాన్ పై రాహుల్ గాంధీ ధ్వజం

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని నశా ముక్త్ చేయడంలో సీఎం భగవంత్ మాన్ విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. పంజాబ్ ఏ మూల నుంచి మాదకద్రవ్యాల బెడదను తొలగించారో స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును కాపాడే నాయకత్వం అవసరమని ఆయన పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.